User Avatar News, Sports

నాలుగు రోజులగా చుక్క నీరు రాని మంచినీటి ట్యాంకులు..

ఎండలు మాడు పగలగొట్టి గొంతు ఎండగడుతుంటే రాజానగరం మండలంలో తాగేందుకు మంచినీటి ట్యాంకులో చుక్క మంచి నీటి బొట్టు లేదు. కార్యాలయాల్లో అధికారులు చల్లటి ఎసి గదుల్లో కుర్చుని ప్రజల మంచినీటి కష్టాలను పట్టించుకోవడం లేదు. మండలంలో భూపాలపట్నం, శ్రీకష్ణపట్నం, కానవరం, వెలుగుబొంద, చక్రద్వారబంధం, రాజానగరం తదితర గ్రామాలకు రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరులో గోదావరి మంచినీటి శుద్ది చేసి పైపులైన్లు ద్వారా గ్రామాల్లో ఉన్న ట్యాంకులకు తాగునీళ్ల అందిస్తున్నారు. గత నాలుగు రోజుల నుండి బొమ్మూరు నుండి నీళ్ల సరఫరా లేకపోవడం వలన మండలంలో మంచినీటి ట్యాంకులను తాగునీళ్ల సరఫరా లేదు. దీనివలన ప్రజలు మంచినీళ్లను డబ్బాలతో కొనుక్కుని తాగుతున్నారు. మౌళిక సదుపాయాలు ఏర్పాటులో ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పుకుంటున్న అధికార పార్టీ పెద్దలు నాలుగు రోజుల నుండి గ్రామాలకు మంచినీళ్ల రాకపొయినా కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. తాగునీళ్లు కోసం రాష్ట్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్, రూరల్ వాటర్ సప్లయ్ సనీటరీ ప్రొగ్రాం, నేషనల్ రూరల్ డిక్రింగ్ వాటర్ తదితర పధకాలు భారీ ప్రచారం మాత్రం చేస్తుంది. ఇవి క్షేత్ర స్థాయిలో పూర్తిగా అమలు జరగడం లేదు.  దీని కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న కోట్లాది రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు. అయితే మండలంలో కొన్ని గ్రామాల్లో నీళ్లను కొనుక్కుని తాగే సౌకర్యం లేదు. దీనిని జిల్లా, మండల, గ్రామాల్లో అధికారులు తమకు సంబంధం లేదు అనే విధంగా ఉన్నారు. నాలుగు రోజులుగా మంచినీళ్ళు రాకపోయినా జిల్లా స్ధాయి అధికారులు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మంచినీటి నీళ్ళు ట్రాక్టర్లు ద్వారా సరఫరా చేయాలి అనే నైతిక బాధ్యతతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేవు. తాగునీటి కోసం అధికారులు, పాలకులు పట్టించుకోవడం వలన దేవునిపైనే భారం వేసి వర్షం కోసం ఆశగా చూస్తున్నారు.