User Avatar Crime

కార్మికులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం…

రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటుందని రాష్ట్ర కార్మిక సంక్షేమ సంఘం డైరెక్టర్ నీలపాల అరవరాజు అన్నారు. రాజానగరంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మేడేను శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు జే.సత్తిబాబు ఆధ్వర్యంలో విక్షిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్) కూలీలు ఏర్పాటు చేసిన మేడే జెండాను కార్మిక సంక్షేమ శాఖ డైరెక్టర్ అరవ రాజు, సాయిబాబా గుడి సమీపంలో జిల్లా అధ్యక్షులు సత్తిబాబు, సూర్యారావుపేటలో న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం.దుర్గాప్రసాద్ ఎగరవేశారు. దీనిపై కార్మిక సంక్షేమ శాఖ డైరెక్టర్ అరవ రాజు మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికులు రూ.120 కడితే ఐదు సంవత్సరాలు బీమా సౌకర్యం, కూలీలకు పింఛన్ల పధకాలు ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. దీనిలో మల్లవరపు రాజు, మరికుర్తి వీరలక్ష్మి, ఆదిమూలపు అంజి, తుమ్మల కళావతి, షేక్ బేబీ, కొల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.