User Avatar News

APWJF జిల్లా అధ్యక్షుడుగా వెలుగూరి రవికుమార్, APBJA జిల్లా అధ్యక్షుడుగా సీహెచ్. వెంకట్ ఏకగ్రీవంగా నియామకం..

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (APWJF) జిల్లా అధ్యక్షుడుగా వెలుగూరి రవికుమార్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (APBJA) జిల్లా అధ్యక్షుడుగా సీహెచ్. వెంకట్ ఏకగ్రీవంగా తీర్మానంతో ప్రకటించారు. రాజమహేంద్రవరం జాంపేట సమీపంలో పోలీస్ కన్వెన్షన్ హాల్లో APWJF, APBJA జిల్లా మహాసభ గురువారం జరిగింది. ఈ సందర్భంగా ప్రజాశక్తి సబ్ ఎడిటర్ రాంబాబు అధ్యక్షుతన ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జర్నలిస్టులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం APWJF రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వెంకట్రావు, కార్యదర్శి జి.ఆంజనేయులు, వర్కింగ్ జర్నలిస్ట్ ఎడిటర్ ఆకుల అమరయ్య, ఉపాధ్యక్షుడు వాతాడ నవీన్ రాజ్ ఆధ్వర్యంలో APWJF జిల్లా అధ్యక్షుడుగా రవికుమార్, కార్యదర్శి పోతుల వెంకటేష్‌, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా సభ్యుల తీర్మాణంతో నియమించారు. ఇదేవిధంగా APBJA జిల్లా అధ్యక్షుడుగా 99 టీవీ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సీహెచ్. వెంకట్, ఉపాధ్యక్షులుగా కె. శివరామకృష్ణ (రాజానగరం రాజు న్యూస్), రామరాజు (బిగ్ టీవీ), చంటిబాబు (సీవీఆర్), కార్యదర్శిగా జె. సత్తిబాబు (10 టీవీ), కార్యానిర్వాక కార్యదర్శి ఎస్. రాంబాబు (ఓఎన్‌సీ), సహాయక కార్యదర్శి ఎస్. పోశయ్య (హెచ్ఎంటీవీ) నియామకం జరిగింది.