User Avatar News

రేపు రాజమహేంద్రవరంలో జిల్లా APWJF, APBJA జిల్లా మహాసభ

ఈనెల 30వ తేదీన తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (APWJF), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (APBJA) జిల్లా మహాసభ రాజమహేంద్రవరం జాంపేట సమీపంలో పోలీస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నామని జిల్లా ఇన్ చార్జి వెలుగూరి రవికుమార్ తెలిపారు. దీనిలో గ్రామీణ, పట్టణాల్లో పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. ముఖ్య అతిథిలుగా మంత్రి కందుల దుర్గేష్, గౌరవం అతిధులుగా ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్స్, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీలు, ప్రత్యేక అతిథులుగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్, నగర కమీషనర్, విశిష్ట అతిథులుగా APWJF రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వెంకట్రావు, కార్యదర్శి జి.ఆంజనేయులు తదితరులు వస్తున్నారని చెప్పారు. జిల్లాలో గ్రామీణ పట్టణాల్లో పాత్రికేయులు పని చేస్తున్న విలేకరులు పాల్గొన్నాలని కోరారు.