User Avatar News

రాజానగరం ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకురాలు ఉద్యోగాలకు దరఖాస్తులు..

రాజానగరం ఐ.సి.డి.యస్.ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీగా ఉన్న రెండు అంగన్వాడి కార్యకర్తలు, 34 అంగనవాడి సహాయకురాలు ఉద్యోగులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రాజెక్టు అధికారిని జి. గౌరమ్మ తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో రాజమహేంద్రవరం మండలంలో 15, కడియం మండలంలో 10, రాజానగరం మండలంలో 9 సహాయకురాలు, అంగన్వాడి కార్యకర్తలు రెండు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఈనెల 23వ తేదీ నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.