User Avatar News

జనసేన అధినేత చెప్పినా రాజానగరం నియోజకవర్గంలో మధ్యం అధిక ధరలు

రాజానగరం నియోజకవర్గంలో మధ్యం సీసాల ధరలు ఎం.ఆర్.పి కంటే అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారు. ముందస్తుగా మధ్యం షాపులు యజమానులందరు సిండికేట్గుగా ఏర్పడి ఎక్సైజ్ అధికారులతో మమాళ్ల ఒప్పద్దం కుర్చుకున్న తర్వాత మధ్యం అధిక ధరలకు అమ్ముతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో భాగస్వామి పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో తొలిసారిగా ప్రకటించిన రాజానగరం నియోజకవర్గంలో మధ్యం అధిక ధరలపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో మూడు మండలాల్లో మధ్యం షాపులు రాజానగరం ఏడు, కోరుకొండ ఆరు సీతానగరం ఆరు ఉన్నాయి. ప్రతి షాపులోను మధ్యం సీసాపై ఉన్న ఎం.ఆర్.పి క్వాటర్ బాటిల్ రూ.10, ఆఫ్ బాటిల్ రూ.15, ఫుల్ బాటిల్ రూ.20 అధిక ధరలకు అమ్ముతున్నారు. దీనితోపాటు చల్లని ఒక లీటర్ మంచినీటి బాటిల్ రూ.25, మధ్యం తాగేటప్పుడు సంజుకునే చిరుతిండ్లు ప్రతి ప్యాకెట్ రూ.10 అమ్ముతున్నారు. ప్రతి మధ్యం షాప్ ప్రక్కన పర్శిట్ రూమ్ ఏర్పాటు చేసుకుని దానిలో మధ్యం 90 ఎం.ఎల్ లూజ్ అమ్మకాలు జరుగుతున్నాయి. పర్మిట్ రూమ్ ఉదయం ఏడు గంటల నుండి అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటున్నాయి. నిబంధనలు ప్రకారం మధ్యం అధిక ధరలకు అమ్మకాలు చేయడం, మధ్యం షాపుల్లో చిరుతిండ్లు, మంచినీటి బాటిల్స్, పర్మిట్ రూమ్ లూజ్ అమ్మకాలు చట్ట ప్రకారం నేరం. దీనిపై ఫిర్యాదు చేస్తే మధ్యం షాపులను సీజ్ చేయడం తోపాటు జరిమానాలు విధించడం జరుగుతుంది. అయితే దీనికి మధ్యం కొనుగోలు చేసినట్లు బిల్ ఉండాలి. మద్యం దుకాణాల యజమానులు అర్థికంగాను, రాజకీయంగా పలుకుబడి, అధికారుల అండ ఉండడంతో బిల్ అడిగినా ఇవ్వడం లేదు. కొందరు బిల్ అడిగే వారికి మద్యం అమ్మడం లేదు, షాపుల్లో సిబ్బంది వాగ్వివాదం చేస్తున్నారు. ప్రతి రోజు మధ్యం షాపులపై తనిఖీలు చేపట్టాల్సిన ఎక్సైజ్ అధికారులు నెల వారీ మామాళ్లు తీసుకోడం వలన పట్టించుకోవడం లేదు అనే విమర్శవస్తున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ సర్వసభ్య నమావేశంలో మధ్యం అధిక ధరలు అమ్మకాలు జరిపిన షాపులపై కేసులు నమోదు చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా క్షేత్రస్థాయిలో పట్టించుకోవడం లేదు. పైగా జనసేన పార్టీకి ప్రాతినధ్యం వహిస్తున్న రాజానగరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఆదేశాలు బుట్టదాఖాలు కావడం విశేషం.