User Avatar News, Political

పేదల భోజనంపై కూటమి నాయకులు చిన్న చూపు…?.

అన్నం కావాల్సిన పేదవాడు ఉండాలి అనుకుంటే ఉంటాడు ఆలస్యం అయితే వెళ్లిపోతాడు అనుకున్నారేమో రాజానగరం నియోజకవర్గంలో కూటమి నాయకులు. సొంత పనులు అన్నీ ముగించుకుని రాజానగరం మెయిల్ రోడ్ లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటిన్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గంటన్నర ఆలస్యంగా బుధవారం ప్రారంభించిన అనంతరం భోజనం చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభోత్సవం ఉంటుందని అధికారులు చెప్పడంతో భోజనం చేయడానికి పేదలు, వృద్ధులు చెప్పిన సమయానికి వచ్చారు. 11.45 నిమిషాలకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వచ్చినా రుడా చైర్మన్ బొడ్డు రాలేదు. దీంతో ఎమ్మెల్యే అరగంట సమయం చూసి అక్కడ నుండి వెళ్లిపోయారు.‌ ఎమ్మెల్యే బత్తుల, రుడా చైర్మన్ బొడ్డు కోసం ఆర్డీవో ఆర్. శివరాముడు, తహశీల్దార్ జిఎవిఎల్ దేవి, ఎంపిడిఓ జెఎ ఝాన్సీ సుమారు గంటన్నర పైగా ఎదురు చూశారు. ఈలోగా 12 గంటలకు భోజనం చేద్దాం అని వచ్చిన నిరుపేదలు వృద్దులు భోజనం సమయం మించిపోవడం వలన ఆకలితో తిరిగి వెళ్ళి పోయారు. వృద్ధులు భోజనం చేయకుండా వచ్చి వెళ్లిపోతున్నారని ఎంపిడిఓ దృష్టికి తీసుకుని వెళ్తే ఎమ్మెల్యే ప్రారంభించే వరకు భోజనాలు పెట్టడం జరగదిని చెప్పడం విశేషం. ప్రభుత్వం పేదల కోసం పెడుతున్న భోజనం పెట్టే దానిలో సమయం పాటించకపోవడంపై కొందరు కూటమి నాయకులు అసహనం వ్యక్తం చేశారు.