User Avatar Education, News

ఇంటర్మీడియట్ ఉత్తమ ఫలితాలు సాధించిన గాయత్రీ విద్యా సంస్థలు… .

రాజానగరం మండలం కానవరం గాయత్రీ విద్యాసంస్థలు ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ సంవత్సరంలో ఫలితాల్లో విద్యార్ధులు విజయ దుందుభి మోగించింది. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 470 మార్కులకు సిహెచ్ దివ్యశ్రీ 464, సిహెచ్ శిరీష 463 ,ఆర్ బాల త్రిపురేశ్వరి 459, పంతం మాధురికి 459 సాధించారు. 400 పైగా దాటి వచ్చిన మార్కులు 48 మంది విద్యార్థులు ఉన్నారు. ద్వితీయ సంవత్సరంలో 1000 మార్కులకు వి. ప్రియ అక్షయ 983, ఎం. యమునా దేవి 461, ఎం . సురేంద్రబాబు 975, N సత్యా తేజశ్రీ 975, దేవి అర్చన వై 975 సాధించారు. 900కు పైగా దాటి మార్కులు 30 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ వి వి ఎస్ ఎన్ మూర్తి అభినందించారు.