User Avatar Education, News

పరిశోధనలు విద్యార్థులు పెంచుకోవాలి …రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. .ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం 17వ స్నాతకోత్సవంలో విద్యార్థులకు పట్టాలు ప్రదానం…

జ్ఞానంతోపాటు స్వతంత్రగా ఆలోచనలు చేసి విశ్లేషణాత్మక పరిశోధనలు పెంచుకోవాలి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విద్యార్ధులకు సూచించారు. భారతీయ సంస్కృతి మూలాలను పెంపొందించుకోవాలన్నారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం 17వ స్నాతకోత్సవ కార్యక్రమం ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం నిర్వహించారు. దీనికి విశ్వవిద్యాలయం కులపతి, గవర్నర్ ఆచార్య అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై 2022-23, 2023-24 విద్యా సంవత్సరానికి పిహెచ్.డి పట్టభద్రులు 21, గోల్డ్ మెడల్స్ 14, ప్రైజ్ 10 తోపాటు పీజీ కోర్సులు ఎంఏ, ఎంకామ్, ఎంబీఏ, ఎల్.ఎల్.ఎం, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంఈడీ, ఎల్.ఎల్.బి., బీఈడీ కోర్సులు పూర్తి చేసిన పూర్తి చేసిన వారికి పట్టాలను ప్రధానం చేసి పట్టభద్రలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఉపకులపతి ఆచార్య ఎస్ .ప్రసన్న శ్రీ అధ్యక్షున సభలో  గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ తెలుగు తొలి కవి నన్నయ్య రచించిన మహాభారతాన్ని ప్రస్తావిస్తూ అలిగిన నలుగక, యెగ్గులు పలికిన మణివిన యట్లు… కోపాన్ని అదుపులో ఉంచి, అవమానాలను పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండే వాడు నిజమైన ధర్మజ్ఞుడున్నారు. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అనే భారతీయ సంస్కృతి విలువలను జీవితంలో ఉండాలని విద్యార్థులకు సూచించారు. జ్ఞానంతోపాటు స్వతంత్రగా ఆలోచనలు విశ్లేషణాత్మక పరిశోధనలు పెంచుకోవాలన్నారు. విద్యార్థులు విజయానికి లక్ష్యం నిర్ధారణ  , కఠిన శ్రమ, పట్టుదల ఈ ముఖ్యం సూత్రాలన్నారు. భారతీయ సంస్కృతిలోని వసుధైవ కుటుంబకం భావనను ప్రస్తావిస్తూ ప్రపంచాన్ని ఒక కుటుంబంగా చూడాలని పిలుపునిచ్చారు. మరో ముఖ్య అతిథి సిక్కిం విశ్వవిద్యాలయం వ్యవస్థాపకడు ఉపకులపతి, జె.ఎన్.యూ సీనియర్ ప్రొఫెసర్ మహేంద్ర పి. లామా‌ శాస్త్రీయ దృక్పథం తో కృషి పట్టుదల ఉంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు. దీనిలో రిజిస్ట్రార్ ఆచార్య కెవి స్వామి, యాప్సీ చైర్మన్ మధుమూర్తి, ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, గోరింట్ల బుచ్చయ్యచౌదరి, జిజియు ఉపకులపతి కెవిపి సత్యనారాయణ రాజు, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి. నరసింహ తదితరులు తదితరులు పాల్గొన్నారు.