User Avatar News, Political

దివాన్ చెరువులో ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవం…70 అడుగుల బిజెపి జెండాను ఎగురవేసిన కంబాల శ్రీనివాసరావు

రాజానగరం మండలంలో బిజెపి 46వ ఆవిర్భావ దినోత్సవం విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు,  పార్టీ రాష్ట్ర నాయకుడు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. దివాన్ చెరువు జాతీయ రహదారి శ్రీ దాబా ఫ్యామిలీ రెస్టారెంట్ సమీపంలో  70 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన బిజెపి జెండాను కంబాల శ్రీనివాసరావు ఎగురవేశారు. అనంతరం నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపి ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో అత్యధిక సభ్యత్వాలు నమోదైన పార్టీగా బిజెపి ఎదిగిందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బిజెపి విజయానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీనిలో రాష్ట్ర కార్యదర్శి, బొమ్ముల దత్తు, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు రేలంగి శ్రీదేవి, పార్టీ మండల అధ్యక్షుడు ఆళ్ల శివ నాగరాజు,  ఆడబాల గణపతిరావు, చిక్కిమ్ మోహిని, జిల్లా కిసాన్ మోర్చ ఉపాధ్యక్షులు ప్రగడ విష్ణు మూర్తి, దొడ్డ అర్జున్,  కమతం సత్యవేణి, సిద్దిన నాగరాజు, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.