User Avatar Crime, News

చోరీ కేసులో నిందితుడు అరెస్టు…

ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనాలు పాల్పడిన నిందితుడుని రాజానగరం పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఇతని నుండి సుమారు రూ. 2 లక్షలు విలువైన బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ లో సిఐ జిజవివి నాగేశ్వర రావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలిపిన వివరాలు. గత నెల 25వ తేదీ ఉదయం మండలంలో కానవరం చెందిన కోరాడ శివలక్ష్మి ఇంటికి తాళం వేసి ఫరిజిల్లిపేట గ్రామాలో జీడిపిక్కల ఫ్యాక్టరీలో పనికి వెళ్ళింది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి ఇంట్లో బీరువాలో ఉన్న 82.5 గ్రాముల బంగారం, 450 గ్రాముల వెండి వస్తువులు దొంగిలించారని పోలీసులు ఫిర్యాదు చేసింది. దీనిపై ఎస్ఐ పి.నారాయణమ్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగతనం జరిగిన ప్రదేశంలో వేలిముద్రలు ఆధారంగా కాకినాడకు చెందిన జామి వీర గణేష్ నిందితుడుగా గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడు నుండి 75.48 గ్రాముల బంగారం, 253.080 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2 లక్షల 5 వేలు ఉంటుందని సిఐ తెలిపారు. కేసు దర్యాప్తు త్వరగా పూర్తిన సిఐ నాగేశ్వరరావు. ఎస్ఐలు పి.నారాయణమ్మ, సత్యనారాయణ, ప్రియ కుమార్, సిబ్బంది ఎస్ కేకే ఖాదర్, వెంకటేష్ లను ఎస్పీ నరసింహకిషోర్, డిఎస్పీ రామకృష్ణ అభినందించారు.