User Avatar News

నేషనల్ పార్క్, ఎకో సెన్సిటివ్ జోన్ పేరుతో ఆదివాసీలను అడవుల నుండి పంపి అటవీ సంపదలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి పాలకులు కుట్రలు చేస్తున్నారు..ఏఐకేఎంఎస్

నేషనల్ పార్క్, ఎకో సెన్సిటివ్ జోన్ పేరుతో ఆదివాసీలను అడవుల నుండి పంపి అటవీ సంపదలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి పాలకులు కుట్రలు చేస్తున్నాయని అఖిల భారత రైతు – కూలి సంఘం (ఏఐకేఎంఎస్) నాయకులు ఆరోపించారు. ఆదివాసీల మనుగడను దెబ్బతీసే వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ పార్క్, ఎకో సెన్సిటివ్ జోన్ ను వ్యతిరేకిస్తూ  రంపచోడవరంలో  ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు గురువారం నిర్వహించారు.  ర్యాలీ చేపట్టి ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.బొజ్జిరెడ్డి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు.  దీనిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పేరుతో 276 గ్రామాల లక్షలాది గిరిజనులు భూములు కోల్పోయి ఉంటే ఇప్పుడు నేషనల్ పార్క్, ఎకో సెన్సిటివ్ జోన్ పేరుతో ఆదివాసీలను అడవుల నుండి పంపి అటవీ సంపదలను కార్పొరేట్ కంపెనీలు దోచుకోవడానికి మార్గం వేస్తున్నారని ఆరోపించారు.  రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇచ్చి అటవీ సంపదకు గిట్టుబాటు ధర కల్పించాలని వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని అమలు చేయాలన్నారు. దీనిలో జిల్లా కార్యదర్శి జే వెంకటేశ్వర్లు, ట్రైబల్ వేదిక కన్వీనర్ ఎస్.రామ్మోహన్, జిల్లా, అధ్యక్ష కార్యదర్శులు జె సత్తిబాబు,పి వెంకట్ నాయుడు,  ఆర్ రఘువులు, బి శ్రీదేవి, తున్నూరు సర్పంచ్ కళ్యాణి, భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.