User Avatar Crime

గోకవరం మండలం రంపఎర్రంపాలెం, గంగంపాలెం గ్రామాల్లో అక్రమ గ్రావెల్ తవ్వకాలు

గోకవరం మండలం రంపఎర్రంపాలెం సర్వే నెం.471 భూమిలో 1104 క్యూబిక్ మీటర్లు, గంగంపాలెం సర్వే నెం.96/2 భూమిలో 5769 క్యూబిక్ మీటర్ల అనుమతి లేకుండా అక్రమంగా గ్రావెల్ త్రవ్వకాలు జిల్లా భూగర్భ శాఖ అధికారి డి. ఫణి భూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీల్లో బయటపడింది. వెంటనే త్రవ్వకాలు చేస్తున్న రెండు పొక్లైన్లు, ఒక లారీని సీజ్ చేసి గోకవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనిలో గనుల శాఖ సర్వేయర్ పి. శ్రీనివాస్‌, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.