User Avatar Crime

కలవచర్ల లో పన్నిండేళ్ళ మైనర్ బాలికపై అత్యాచారయత్నం

పన్నిండేళ్ళ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన రాజానగరం మండలం కలవచర్ల లో జరిగింది.  స్ధానిక జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న పన్నిండేళ్ళ బాలిక అనారోగ్యం వలన ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమెకు ఆకలిగా ఉండడంతో భోజనానికి సిద్దం అవుతుండగా సమీపంలో నివాసం ఉంటున్న కొల్లి విష్ణు(44) వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి తలుపులు వేశాడు. బాలికను గదిలోకి తీసుకుని వెళ్లి కేకలు వేయకుండా చేత్తో నోరు నొక్కాతూ అత్యాచారయత్నం  చేస్తుండగా కూలీ పనులకు వెళ్లిన తల్లి ఇంటి తలుపు కొట్టడంతో భయపడి  మంచం కిందకు దాక్కున్నాడు. బాలిక  ఏడుస్తూ తలుపు తీసి జరిగింది తల్లికి చెప్పింది. చుట్టుపక్కల వాళ్లు వచ్చి మంచం కింద ఉన్న అతన్ని బయటకు పిలిచి నిలదీస్తూండగా పరారైనాడు. దీనిపై ఎస్ ఐ కె.మురళీకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.