User Avatar News

మార్చి 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్..జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా మార్చి 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు National Legal Services Authority (జాతీయ న్యాయసేవాధికార సంస్థ) చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత గురువారం తెలిపారు. జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ పడదగ్గ క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద పరిహార కేసులు, బ్యాంకు రికవరీ కేసులు, ప్రీ-లిటిగేషన్ తదితర కేసులు అంశాలకు సంబంధించిన వివాదాలను వేగవంతంగా, సఖ్యతా పూర్వకంగా పరిష్కరించు కోవచ్చునన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీ ద్వారా ముగించు కోవాలని తెలిపారు.