User Avatar Crime, News

చెల్లి పెళ్లి చేసుకున్న కొన్ని గంటలకు బావను చంపిన బావమరుదులు…?

చెల్లిని ప్రేమించి వివాహం చేసుకుందన్న కోపంతో పెళ్లి చేసుకున్న కొన్ని గంటలకు ఆమె అన్నలు అతన్ని కత్తులతో నరికి చంపిన సంఘటన ద్వారపూడి జరిగింది. వివరాలు.. మండపేట మండలం జెడ్. మేడపాడుకు చెందిన అయినవిల్లి సంధ్య రాయవరం మండలంలో డిప్యూటీ తహసిల్దార్ గా పని చేస్తుంది. ద్వారపూడి  గ్రామానికి చెందిన పి. వి. వి సూర్యప్రకాశరావును ప్రేమించి గురువారం వివాహం చేసుకుని ఆరోజే ఇంటికి వచ్చారు. అర్ధరాత్రి సమయంలో ప్రకాశరావు ఒంటరిగా బయటకు  రావడంతో అప్పటికే గ్రామంలో దళితపేట సమీపంలో కాపుకాచి ఉన్న సంధ్య అన్నదమ్ములు, మరో వ్యక్తి అతనిపై కత్తిలతో దాడి చేసి కిరాతకంగా నరికి చంపి పరారైనట్లు సమాచారం. హత్య చేశారని తెలియడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని భర్త మృతదేహాన్ని చూసి సంధ్య తీవ్రంగా రోదించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న కొన్ని గంటలకు హత్య జరగడం తీవ్ర సంచలనంగా మారింది. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.