User Avatar News

ఎంపిటిసి జెడ్పీటీసీలకు రెండో రోజు జోరుగా నామినేషన్లు..

జిల్లాలో ఎంపిటిసి, జెడ్పీటీసీ స్థానాలకు రెండో రోజు గురువారం ఉదయం నుండి జోరుగా కొనసాగుతుంది. జిల్లాలో ఎంపిటిసి 198 , జెడ్పీటీసీ ఆరు మెదటి రోజు బుధవారం నామినేషన్లు వచ్చాయి. ఇది రేపటితో గడువు ముగియడంతో అభ్యర్ధులందరు నామినేషన్లు వేయడానికి ఉత్సాహం వస్తున్నారు. ముందుగా వైకాపా, జనసేన భారీ ర్యాలీలుగా నామినేషన్ కేంద్రాలకు రావడంతో కోలాహలంగా నెలకొంది. నామినేషన్ కేంద్రం పరిధిలో 100 మీటర్ల లోపు సెక్షన్ 144 అమలులో ఉన్నా ఎవరు పాటించడం లేదు. ర్యాలీతో నేరుగా వచ్చేస్తున్నారు. వీళ్ళను పంపించడానికి పోలీసులు ఇబ్బందులు ఎదురవుతున్నారు. అయితే రాజానగరం పోలింగ్ కేంద్రం సమీపంలో డిఎస్పీ వై. శ్రీకాంత్ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించి 100 మీటర్ల లోపు ఎవరు ఉండకూడదు అని హెచ్చరిస్తున్నారు.