User Avatar News

రాజానగరం నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ నరసింహా కిషోర్…

రాజానగరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంపిటిసి నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ డి. నరసింహా కిషోర్ బుధవారం పరిశీలించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం.వి. రమణను భద్రత ఏర్పాట్లును అడిగారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రజలందరూ సంహరించాలని కోరారు. నామినేషన్ కేంద్ర పరిధిలో సెక్షన్ 144 నిబంధనలు కొనసాగిందని దీనిని ఎవరైనా అతిక్రమిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. నామినేషన్ వేసే అభ్యర్థి తోపాటు మరో ఇద్దరు మాత్రమే అనుమతి ఉంటుందని,  ర్యాలీలకు ముందుగా అనుమతి తీసుకోవాలని తెలిపారు. సమస్యాత్మక,  అత్యంత సమస్యాత్మక గ్రామాలను గుర్తించామని, ఎన్నికలు జరుగు అన్నీ గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఉంటుందని చెప్పారు. ఆయన వెంట డిఎస్పీ వై. శ్రీకాంత్, సిఐ ప్రసన్న వీరయ్య గౌడ్ ఉన్నారు.