User Avatar News, Political

టిడిపి, జనసేన నాయకులు కార్యకర్తలు ఎడ ముఖం..పెడ ముఖం..?

రాజానగరం నియోజకవర్గంలో టిడిపి క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్నా రెండేళ్లగా నాయకులు, కార్యకర్తలను ప్రక్కన పెట్టడం వలన గ్రామ స్థాయిలో పార్టీ బలహీనంగా మారింది. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండి కూటమి విజయానికి కృషి చేసినా తగినంత గుర్తింపు ఇవ్వడం లేదని నాయకుల్లో ఆవేదన ఉంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకష్ణ గెలుపుకు టిడిపి నాయకులు, కార్యకర్తలు ప్రధాన పాత్ర పోషించారు. ఎమ్మెల్యే బత్తుల విజయం తర్వాత గ్రామాల్లో జనసేన పార్టీ నాయకులకు ప్రాధాన్యత పెరిగింది. దీంతో టిడిపి నాయకులను ప్రక్కన పెట్టి జనసేన నాయకులు చక్రం తిప్పుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోను టిడిపి నాయకులను పట్టించుకోవడం మానేశారు. దీని వలన గ్రామాల్లో నాయకత్వం కోల్పోయి తీవ్ర అసంతృప్తితో టిడిపి నాయకులు ఉన్నారు. జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గం ఇన్చార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి దృష్టికి తీసుకుని వెళ్ళినా కూటమి ధర్మంగా కలిసి పని చేయాలని హితవు పలుకుతున్నారు. ఆయన మండలంలో నాలుగైదుగురు నాయకులను మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని క్షేత్రం స్ధాయిలో కార్యకర్తలను ప్రక్కన పెట్టారని విమర్శలు వస్తున్నాయి. గతంలో రాజానగరం మండలం ఒక ప్రముఖ బిసి నాయకుడు తన పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు దౌర్జన్యాలు చేస్తున్నారని జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి దృష్టికి తీసుకుని వెళ్ళినా ఫలితం లేకపోయింది. తన పొలంలో దౌర్జన్యం చేసారని పోలీసులను ఆశ్రయిస్తే తనపైనే కేసులు నమోదు చేస్తామని చెప్పారంటూ ఆయన అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు, నాయకులు పార్టీ అధిష్టానం ఏమేరకు ప్రాధాన్యత ఇస్తుంది ఇది అర్థం పడుతుంది. ఇదే విధంగా చాలా గ్రామాల్లో టిడిపి నాయకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈనేపధ్యంలో జరుగుతున్న ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో టిడిపి నాయకులు, కార్యకర్తలు పని తీరు ఎలా ఉంటుందనేని ప్రశ్నర్ధకంగా మారింది..? ఎన్నికల సమయంలో తమను వాడుకున్న తర్వాత చిత్తు కాగితంలా విసిరి ప్రక్కన పారేస్తారంటూ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థి గెలుపునకు కృషి చేసినా జనసేన కార్యకర్తలు మాటే చెల్లుబాటు అవుతుంది అని టిడిపి నాయకులు మౌనంగా ఉండే అవకాశం ఉంది. పైకి మాత్రం కూటమి విజయానికి కృషి చేస్తానని చెబుతున్న క్షేత్రం స్ధాయిలో జరిగేలా లేదు. ఇలా ఉంటే రానున్న ఎన్నికలు ఫలితాలు ఎలా ఉంటాయి వేచి చూడాలి…