User Avatar News

రేపు రాజమహేంద్రవరంలో మెగా జాబ్ మేళా..

జిల్లాలో నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ ఉదయం 10 గంటలకు రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ సమీపంలో  రాజమహేంద్రి డిగ్రీ & పీజీ కాలేజీ ఫర్ ఉమెన్స్ కళాశాలలో  మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వి.జీ.డి మురళి తెలిపారు. దీనికి పది ప్రముఖ సంస్థల ప్రతినిధులు వచ్చి ఇంటర్వూలు చేస్తారని చెప్పారు‌.  10వ తరగతి, ఐటీఐ, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ వయస్సు 19 నుండి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అర్హులు అని తెలిపారు.                                   ఆశక్తి అర్హత అభ్యర్థులు పోర్టల్  www.naipunyam.ap.gov.in లో  పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ చేసిన వారు రెజ్యూమ్, ఆధార్ కార్డు సంబంధిత విద్యా/అనుభవ సర్టిఫికెట్ల జిరాక్స్ తో ఉండాలని సూచించారు. పూర్తి  వివరాలకు 9988853335 నంబర్‌ కు  సంప్రదించాలని కోరారు.