User Avatar News

జిల్లాలో లాటరీ పద్ధతిలో మధ్యం బార్లు కేటాయింపు 

జిల్లాలో బార్లు కేటాయింపు  రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఆర్డీఓ ఆర్.కృష్ణ నాయక్ అధ్యక్షతన జిల్లా ఎక్సైజ్ అధికారి సీహెచ్.లావణ్య శనివారం నిర్వహించారు. దీనిలో నగరానికి చెందిన ఆరు బార్లుకు  ఒక్కొక్కరు దరఖాస్తు లాటరీ విధానంలో ఎంపిక చేశారు. ఓపెన్ కేటగిరీ లో ఎంపికైన దుర్గాప్రసాద్ గొర్రెల, సానబోయిన సురేష్,  మేకా మురళీకృష్ణ , మద్దుల జగదీశ్వర వేణు గోపాల అప్పారావు ,  ఆకుల శ్యామ్ బాబు ,  మన్యం పాండురంగ కృష్ణకాంత్. గీతకులాల కార్మికులకు మూడు బార్లకు సానబోయిన సత్యనారాయణ, జక్కంశెట్టి రమేష్ (R1), గుడాల నాగరాజు (R2) కేటాయంచారు. కొవ్వూరు బార్‌కు ఒకే ఒక్క దరఖాస్తు రావడం వలన వీరవల్లి వీర వెంకట సత్యనారాయణను నేరుగా ఎంపిక చేశారు.  నిడదవోలు బార్లుకు లాటరీలో పాలా మణికిరణ్, విత్తనాల సురేష్ (R1), వీరవల్లి సత్యనారాయణ (R2) ఎంపిక చేశారు.  మొత్తం 43 దరఖాస్తులు స్వీకరించగా ఓపెన్ కేటగిరీకి 24, రిజర్వ్‌డ్ కేటగిరీకి 19 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. దీనిలో అసిస్టెంట్ సూపరిటెండెంట్ పి. నాగ రాహుల్ పాల్గొన్నారు.