User Avatar Education

విద్యుతో సమాజంలో మార్పు….

సమాజంలో మార్పు విద్యతో వస్తుందని డివిజన్ కోర్టు మెజిస్ట్రేట్ ఎన్. రెడ్డి ప్రసన్న అన్నారు. విద్యార్ధులు విద్యపై దృష్టి పెట్టాలని సూచించారు. మండలంలో దివాన్ చెరువు ఎస్.డి.ఎస్.ఎం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాలు, ఎర్లీ ప్రెగ్నెన్సీ పై అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రధానోపాధ్యాయుడు కోరాడ శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు సభలో డివిజన్ కోర్టు మెజిస్ట్రేట్ రెడ్డి ప్రసన్న ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బాలికలపై వివక్షత చూపితే వారిపై కేసులు నమోదు చేసి శిక్షలు అనుభవించాలన్నారు. బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే విధించే శిక్షలను వివరించారు. దీనిలో బొమ్మూరు ఎస్ఐ జి. సత్యనారాయణ, ఉపాధ్యాయులు పి. శర్మ, కె. శ్రీనివాస కుమార్, కె.జీనా తదితరులు పాల్గొన్నారు.