User Avatar News

స్వర్ణ పంచాయితీ వెబ్‌సైట్.,మన మిత్రా యాప్ తో పన్నులు చెల్లింపు… జిల్లా కలెక్టర్

జిల్లాలో 299 గ్రామ పంచాయతీల్లో 3,58,297 అసెస్మెంట్ చేశామని స్వర్ణ పంచాయితీ వెబ్‌సైట్ (https://swarnapanchayat.apcfss.in/) లేదా మన మిత్రా యాప్ ఆధారంగా పన్నుల చెల్లించవచ్చు అని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి తెలిపారు. నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డు, QR కోడ్, D.D, చెక్ రూపంలో డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు అని ఇవి నేరుగా గ్రామ పంచాయితీ ట్రెజరీ ఖాతాలో జమ అవుతాయని చెప్పారు. ప్రజలకు అవగాహన కోసం పంచాయతీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపడతమన్నారు.