User Avatar Crime, News

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సొమ్ముతో సచివాలయం ఉద్యోగి పరార్.

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు రూ.2,13,500 పంపిణీ చేయకుండా సచివాలయం ఉద్యోగి జుత్తుక గణేష్‌ డబ్బులతో పరారైన సంఘటన రంగంపేట మండల చండ్రేడులో సోమవారం జరిగింది. ఇతనినిపై పోలీసులు కేసు నమోదు చేసి విధుల నుండి సస్పెండ్ చేశారు. గ్రామాలకు చెందిన పింఛనుల పంపిణీ రూ.14,03,000 గత నెల 30వ తేదీన సంక్షేమ, విద్యా సహాయకులు బ్యాంకు నుండి డ్రా చేసి సంబంధిత అధికారులకు అందజేశారు. దీనిలో రూ.2,13,500 వెటర్నరీ అసిస్టెంట్ జుత్తుక గణేష్‌కి ఇచ్చి రశీదు తీసుకున్నారు. ఇతను సోమవారం పింఛన్లదారులకు నగదు పంపిణీ చేయకుండా విధులకు హాజరు రాకుండా సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి గైర్హాజరయ్యారు. దీనిపై ఎంపిడిఒ వి.సాయిబాబు విచారణ చేపట్టి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో గణేష్‌పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విధులు నుండి  సస్పెండ్ చేసినట్లు ఎంపిడిఓ తెలిపారు. చండ్రేడు గ్రామంలోని పింఛన్లదారులు ఇబ్బందులు రాకుండా కొత్త పిడిఒని నియమించి పంపిణీ చేపట్టారు. గణేష్ గతంలో పని చేసిన పెదపూడి మండలంలో ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు తెలిసింది.