User Avatar Crime

పట్టుబడిన 12 క్వింటాళ్ల రేషన్ బియ్యం..

రాజానగరం జాతీయ రహదారి బిపిసిఎల్ పెట్రోల్ బంక్ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 12 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ గురువారం అధికారులు పట్టుకున్నారు.‌ విజయవాడ నుండి కాకినాడకు టాటా మినీ లారీలో రేషన్ బియ్యం తరలిస్తున్నారని సమాచారం రావడంతో తనిఖీలు చేపట్టగా 12190 కేజీల రేషన్ బియ్యం పట్టుబడింది. పిఠాపురం గ్రామానికి చెందిన గాలి వెంకటేష్ లారీ యజమాని డ్రైవర్ ఒక్కరే అని పౌర సరఫరాల శాఖ అధికారి గొలుగూరి బాపిరాజు తెలిపారు. బియ్యం విలువ రూ.5,60,740 ఉంటుందని మినీ లారీ సీజ్ చేసి అతనిపై కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.