User Avatar Education, News

విద్యార్థులు నైపుణ్యంతో ఉన్న వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి..జిజియు ఛాన్సలర్ చైతన్య రాజు 

👉.. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వం లక్షణాలు, క్రమశిక్షణ, సృజనాత్మకత ఉండాలని గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం (జిజియు) ఛాన్సలర్ కె.వి.వి. సత్యనారాయణ రాజు (చైతన్య రాజు) అన్నారు.  జిజియు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇండక్షన్ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. దీనికి చైతన్య రాజు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన జీవితంలో విజయాలు తధ్యం అన్నారు. విద్యార్థులు తరగతి గదిలో విద్యకు పరిమితం కాకుండా పరిశోధన, ఆవిష్కరణలు, సాంకేతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ప్రో-ఛాన్సలర్ కె. శశికిరణ్ వర్మ మాట్లాడుతూ జీవితం ఒక మారథాన్ వంటిదని, ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ నిరంతరం ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. పరిశ్రమలు, భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, ఇండస్ట్రీ ఎక్స్‌పెక్టేషన్స్‌కు అనుగుణంగా కోర్సులను రూపొందించి విద్యార్థులను తగిన విధంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. దీనిలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ యు. చంద్రశేఖర్, ప్రో-వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె.వి.బి. రాజు, రిజిస్ట్రార్ డాక్టర్ పి.ఎం.ఎం.ఎస్. శర్మ, డైరెక్టర్లు డాక్టర్ ఎం. శ్రీనివాసరావు, వి. సతీష్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి.ఎస్. బాబు, డీన్ డాక్టర్ ఎన్. లీలావతి తదితరులు పాల్గొన్నారు.