User Avatar News

రైతులు అప్రమత్తంగా ఉండాలి – కలెక్టర్.  నానో యూరియా వినియోగించాలి – వ్యవసాయ అధికారి

జిల్లాలో అధిక వర్షాలు కురిస్తుండడం వలన పంటలకు నష్టం వచ్చే అవకాశం ఉందని రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కోరారు. పంటల రక్షణకు శాస్త్రీయ పద్ధతులను పాటించాలన్నారు. పొలాల్లో అధిక నీరు నిల్వ ఉంటే డ్రైనేజీ ద్వారా బయటకు వెళ్లేలా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు మాట్లాడుతూ రైతులు యూరియాను వర్షకాలంలో పొలాల్లో చల్లడం వలన నీటిలో కరిగిపోయి లేదా ఆవిరైపోయి వృథా అవుతుందన్నారు. సాధారణ యూరియాలో కేవలం 30% మాత్రమే పంటలకు ఉపయోగపడతుందని, మిగతా 70% వృథా జరుగుతుందని తెలిపారు. ప్రతి ఎకరాకు 500 మిల్లీ లీటర్ల (అర లీటర్) నానో యూరియాను పిచికారి చేయడం వలన పంటకు చేరి 90% వరకు ప్రయోజనం కలిగిస్తుందని చెప్పారు.