User Avatar News

తోకాడ గ్రామం భూ రీ- సర్వే

 ఆంధ్రప్రదేశ్ రీ-సర్వే ప్రాజెక్ట్ ఫేజ్-1లో భాగంగా ఈ నెల రెండు తేదీన జారీ చేసిన 13వ నోటిఫికేషన్ ప్రకారం రాజానగరం  మండలంలోని తోకాడలో ఫైనల్ ఆర్ఓఆర్ గ్రామ సభ జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. దీనిలో జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ రీ సర్వే గ్రామ సభలో వివరాలు తెలియ చేయడం  జరుతుందన్నారు. దీనిపై వచ్చిన అభ్యంతరాలను పరిగణన లోనికి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. దీనిలో ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్ మాట్లాడుతూ గ్రామంలో మొత్తం 658 సర్వే నంబర్లకు 3410 ఎల్పిఎమ్ డిఎల్ఆర్ పబ్లికేషన్ చేస్తే గ్రామ విస్తీర్ణం 4674.19 ఎకరాలు, రీ-సర్వే తర్వాత 4654.969 ఎకరాలు నిర్ధారణ జరిగాయని చెప్పారు. దీనిలో  ప్రభుత్వ భూమి 247 సర్వే నంబర్లులో ఎకరాలు 341.65, రీ-సర్వే తర్వాత 341.052  ఉన్నాయన్నారు. ప్రైవేట్ భూమి 415 సర్వే నెంబర్లలో ఎకరాలు 4332.54, రీ-సర్వేలో 4313.91 ఉందన్నారు.  దీనిలో సర్వే అధికారి మోహన్ రావు, తహసిల్దార్ జి.ఎల్.వి. దేవి, సర్వేయర్స్ తదితరులు పాల్గొన్నారు.