User Avatar News, Sports

ర్యాగింగ్ తో స్వేచ్ఛకు భంగం కలిగిస్తే కేసులు. జిల్లా ఎస్పీ డి నరసింహా కిషోర్

ర్యాగింగ్ తో స్వేచ్చను భంగం కలిగించి అవమానం చేస్తే కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ డి నరసింహా కిషోర్ విద్యార్థులను హెచ్చరించారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో యాంటీ ర్యాగింగ్ వీక్ ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ డి. నరసింహా కిషోర్, వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ  బుధవారం హాజరైనారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ఆవరణలో మొక్కను నాటి ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసిన సభకు జ్యోతి ప్రజ్వన చేసి ఎస్పీ డి. నరసింహా కిషోర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో చదివే విద్యార్థులు ర్యాగింగ్ చేసి ఆకతాయి చేష్టలు చేస్తే జీవితాలు  అంధకారంగా ఉంటుందన్నారు. శారీరకంగా, మానసికంగా ఇతరులను బాధపెడుతూ ర్యాగింగ్ కు పాల్పడితే పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని హెచ్చరించారు.  విద్యను సద్వినియోగం చేసుకుంటే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని, డ్రగ్స్ తీసుకొని జీవితాలు పాడైపోయని జాగ్రత్తగా ఉండాలన్నారు. వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ ర్యాగింగ్ సంస్కృతిని నిర్మిద్దామని అన్నారు. అనంతరం మాదకద్రవ్య రహిత సమాజానికి కృషి చేస్తానని ఎస్పీ డి నరసింహకిషోర్ విద్యార్ధులతో ప్రతిజ్ఞ చేయించారు. దీనిలో రిజిస్ట్రార్ ఆచార్య కె.వి.స్వామి, స్టూడెంట్ అఫైర్స్ డీన్ ఆచార్య ఎన్. ఉదయభాస్కర్, లీగల్ ఆఫీసర్ నందెపు నాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.