User Avatar News

రాజానగరంలో పబ్లిక్ హెల్త్ యూనిట్ సంఖుస్థాపన..

రాష్ట్రంలో 166, 162, 102 విడతల వారీగా బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు మంజూరైనాయని ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. జిల్లాలో 19 ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆరోగ్య మంత్రి జిల్లాలో పర్యటణలో భాగంలో రాజానగరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో రూ.50 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేయనున్న బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ కు మంత్రి సత్య కుమార్ సంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ అండ్ బి శాఖతో 15వ ఆర్థిక సంఘం నిధులతో బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ నిర్మాణం చేస్తున్నామని ఏడాదిలోపు పూర్తి చేయడం జరుగుతుందని చెప్పారు. కోవిడ్ సమయంలో పరీక్షల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. దీనిలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, నీరుకొండ వీరన్న చౌదరి తదితరులు పాల్గొన్నారు.