User Avatar News

ఈనెల 23 నుండి 30వ తేదీ వరకు పాఠశాలలో విద్యార్థులకు ఆధార్ బయోమెట్రిక్…

జిల్లాలో 96 పాఠశాలల్లో  ఈనెల 23 నుండి 30 వరకు  ప్రత్యేక ఆధార్ బయోమెట్రిక్ శిబిరాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి  తెలిపారు. దీనిలో 5–17  ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు ఉచితంగా బయోమెట్రిక్ నవీకరణ జగుతుందన్నారు. విద్యార్థులకు ఆధార్ రికార్డులో వేలు ముద్రలు, ఐరిస్ స్కాన్, ఫోటో అప్‌డేట్ జరుగుతుందని చెప్పారు. దీని వలన  ప్రభుత్వ పథకాలు, స్కూల్ సర్వీసులు, పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడం సులభం ఉంటుందని తెలిపారు. దీనికి ప్రధానోపాధ్యాయులు, విద్యా అధికారులు  సహకరించాలని కోరారు.