User Avatar Crime, News

ఎసిబి అధికారులు పేరుతో డబ్బులు వసూళ్లు చేస్తే  పోలీసులకు ఫిర్యాదు చేయండి.. ఎసిబి డిఎస్పీ ఎమ్. కిషోర్ కుమార్ 

ఎసిబి అధికారులు అని ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్న 9440446160, 0883 – 2467833 ఫోన్ నెంబర్ల సంప్రదించాలని అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ ఎమ్. కిషోర్ కుమార్ తెలిపారు. ఈనెల 19వ తేదీన కాకినాడ నగరపాలక సంస్థ ఉద్యోగులకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి, దాడులు జరగకుండా ఉండాలి అంటే డబ్బులు ఇవ్వాలి అనే విధంగా మాట్లాడడం ఎసిబి అధికారుల దృష్టికి వచ్చింది.  దీనిపై డిఎస్పీ ఎమ్. కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఎసిబి అధికారులు నేరుగా లేదా ఫోన్ ద్వారా డబ్బులు, ఏ ఇతర ప్రయోజనాలు అడగడం జరుగదన్నారు. ఎసిబి పేరుతో డబ్బులు అడిితే  పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఎసిబి అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. నకీలీ వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని కోరారు.