User Avatar Crime, News

ఆగి ఉన్న లారీని ఢీ కొని వైజాగ్ చెందిన వ్యక్తి మృతి

కడియం మండలం కడియపులంక జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టడంతో ఓకే వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. గాజువాక అగనంపూడికి చెందిన దాసరి కిరణ్ కుమార్ (26) విజయవాడ నుండి విశాఖపట్నం కారులో వెళుతూ మార్గమధ్యంలో కడియపులంకలో ఆగి ఉన్న లారీని వేగం ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం లారీలో ఇరుక్కుపోయి దాసరి కిరణ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. హైవే సేఫ్టీ అధికారులు క్రేన్ సహాయంతో లారీ నుండి కారును వేరు చేసి మృతదేహాన్ని బయటకు తీశారు. దీనిపై కడియం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.