User Avatar Education, News

జి.జి.యు. యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలి.. ఎస్ఎఫ్ఐ డిమాండ్ 

విద్యార్థులను వేధిస్తున్న గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జిజియు) గుర్తింపు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసారు. దీనిలో చదువుతున్న విద్యార్థుల నుండి ఫీజు రీయింబర్స్మెంట్ బలవంతంగా వసూళ్ళ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై. భాస్కర్, ఎన్. రాజా మాట్లాడుతూ ఈనెల 23వ తేదీ నుండి జిజియు పాలిటెక్నిక్ కళాశాలలో జరగనున్న  మొదటి సంవత్సరం పరీక్షలకు ఫీజు రీయంబర్స్మెంట్ కడితేనే హాల్ టికెట్స్ ఇస్తామని బెదిరిస్తూ బలవంతపు వసూళ్లుకు పాల్పడుతున్నారన్నారు. దీనిపై అనేక సార్లు అధికారులకు, యాజమాన్యానికి మెర పెట్టుకున్న వైఖరి మారలేదన్నారు. జి.జి.యుపై ప్రభుత్వం కమిటీ వేసి అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిలో జిల్లా కమిటీ సభ్యులు కనక, జ్యోతి, కార్తిక్, సౌమ్య, సాహితి తదితరులు పాల్గొన్నారు.