User Avatar Political

ఎమ్మెల్యే బత్తుల తీరుపై మండిపడ్డ వైకాపా నాయకులు

రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అక్రమ సంపాదనపై కాకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని వైకాపా నాయకులు సూచించారు. ఎమ్మెల్యే బత్తుల తీరుపై కూటమి నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. రాజానగరం వైకాపా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే బత్తులపై తీవ్ర విమర్శలను చేశారు. దీనిలో మండల కన్వీనర్ దూలం పెద్ద మాట్లాడుతూ నియోజకవర్గంలో మూడు మండలాల్లో ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్లో భారీగా డబ్బులు వసూళ్ళ చేయడం వలన ప్రభుత్వం కార్యాలయాల్లో సేవలకు రేట్లు నిర్ణయించి మామోళ్ళు వసూళ్ళ చేస్తున్నారని ఆరోపించారు. ఆవ భూముల కోసం పోరాడిన అఖిలపక్ష నాయకులు ఆవ భూముల్లో చెట్లను అమ్ముకున్నాడన్నారు. మధ్యలో నిలిచిపోయిన రాజానగరం రావుల చెరువు గట్టు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గ్రామాల్లో నిర్మించిన మంచినీటి ట్యాంకులు, సచివాలయాలు, పేదలకు ఇళ్ళు స్థలాలు, రహదారులు తదితర వాటి చేపట్టిన దాని కన్న ఒక్కటైనా ఎక్కువగా చేయాలని సవాల్ చేశారు. అన్నదాన సత్రం భూములు వేలంపాటలో సిండికేట్ గా ఏర్పడి రూ.6 లక్షల 50 వేలు వేలంపాట దక్కించుకుని మళ్ళీ కూటమి నాయకులు అంతా రూ.11 లక్షలకు అమ్మకో లేదా అన్నారు. యువతను రెచ్చగొట్టి వారి జీవితాలు పాడుచేయ వద్ద హితవు పలికారు. రానున్న స్ధానిక ఎన్నికల్లో మీ కూటమి నాయకులు, ప్రజలు మీకు బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. దీనిలో గంగిశెట్జి సోమేశ్వరరావు, అడబాల చిన్నబాబు, గండి నానిబాబు, కుందేటి ప్రసాద్, సంగీత ప్రసాద్, వల్లభశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.