User Avatar Crime, News

ఇళ్ళలో దొంగతనాలు చేస్తున్న వ్యక్తులు అరెస్టు

ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేస్తున్న వ్యక్తులను రాజానగరం పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై పోలీస్ స్టేషన్లో సిఐ ఎస్. ప్రసన్న వీరయ్య గౌడ్,క్రైమ్ సిఐ బాల సౌరి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం క్రైమ్ డిఎస్పీ ఎ. సుభాష్ శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలిపిన వివరాలు. గత నెల 16వ తేదీన మండలంలో శ్రీరాంపురం సాయిబాబా గుడి సమీపంలో నివాసం ఉంటున్న యర్రంశెట్టి పట్టాభి ఇంటికి తాళాలు వేసి ఊరికి వెళ్ళాడు. మరునాడు తెల్లవారుజామున వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడేసి బీరువాలో ఉన్న 70 గ్రాముల బంగారం, రూ.10 నగదు దొంగిలించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిలో గుంటూరు చెందిన తిరువీధుల మహేష్ సింగులూరి సురేష్, ఏలూరు చెందిన నమ్మిన నాగార్జున నిందితులుగా గుర్తించి రాజానగరం జాతీయ రహదారి చిన వెంకట్రావు చెరువు సమీపంలో అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. వీరంతా గతంలో బొమ్మూరు, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, విజయనగరం జిల్లా గంట్యాడ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైనాయని డిఎస్పీ చెప్పారు. నిందితుల నుండి 54.2 గ్రాముల బంగారం, రెండు మోటార్ సైకిళ్ళు రికవరీ చేశారు. వీటి విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టిన సిఐ వీరయ్య గౌడ్, ఎస్ఐ జివివి సత్యనారాయణ, క్రైమ్ సిఐ బాల సౌరి సిబ్బందిని ఎస్పీ నరసింహకిషోర్, డిఎస్పీ ఎ. సుభాష్ అభినందించారు.