User Avatar News

పోలీస్ బందోబస్తు మధ్య తూర్పుగోనగూడెం మత్స్యకార సహాయక సంఘం ఎన్నికలు

రాజానగరం మండలం తూర్పుగానుగూడెం హరిజన మత్స్యకార సహాయక సంఘం ఎన్నికలు పోలీస్ నిఘా, బందోబస్తు మధ్య మంగళవారం జరిగింది. స్ధానిక మండల ప్రజా పరిషత్ పాఠశాల ఆవరణలో జరిగిన ఎన్నికల్లో సహాయక సంఘం అధ్యక్షుడు నాగారపు నాగార్జున, ఉపాధ్యక్షుడుగా మేడే మహేష్ ఎన్నికైనారు. సహకార సంఘం మెత్తం సభ్యులు 189 సభ్యత్వాలకు. దీనిలో మరణించిన వారు, వివిధ కారణాల వలన రద్దైనవి పోగా 117 మంది సభ్యులు ఉన్నాయి. దీనిలో 47 మంది సభ్యులు ఎన్నికల్లో పాల్గొన్నారు. ఉదయం 9 నుండి 12 గంటల వరకు కళాశాల ప్రాంగణంలోకి సభ్యులను అనుమతించి 12.30 నిమిషాలకు  ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ఒకేఒక్క కార్యవర్గం ఏర్పాటుకు నామినేషన్ దాఖలు కావడంతో అధ్యక్షుడుగా నాగారపు నాగార్జున, ఉపాధ్యక్షులుగా మేడే మహేష్. కార్యదర్శిగా ప్రత్తి నాని బాబుతో పాటు పాలకవర్గం సభ్యులుగా ఇసుకపల్లి చిన్న, మువ్వల వెంకన్న బాబు, జూలూరి చిన్న, పేకల సారంగుడు, నందికోళ్ళు పాపారావు, నూకతట్జ బ్రహ్మరాజు ఏకగ్రీవంగా ఎన్నుకైనారని ఎన్నికల అధికారి ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ డి.గోపాల రావు ప్రకటించారు . అయితే సుమారు 53 మంది సహాకార సంఘం సభ్యులు ఎన్నికల బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాలని ఎన్నికల అధికారికి వినతిపత్రం అందజేసి ఎన్నికల్లో పాల్గొనలేదు. ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ ఎన్. నిర్మలా కుమారి పర్యవేక్షణలో ఎన్నిక నిర్వహించగా, డిఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో సిఐ ప్రసన్నవీరయ్య గౌడ్ పోలీస్ నిఘా కెమేరాలు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపిఎఫ్ఎ సత్తిబాబు, యుఎఫ్ఎ గణేశ్వరావు, అమ్మాజీ ఎన్నికలకు సహాయకులుగా విధుల్లో పాల్గొన్నారు