User Avatar News

రాజానగరం మండల సమాఖ్య కార్యాలయంలో మామోళ్ళు… మహిళలపై లైంగిక వేధింపులు..?

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఆర్థిక బరోసా కోసం గ్రామాల్లో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి మహిళలకు బ్యాంకు ద్వారా ఇస్తున్న రుణాల్లో(లోన్స్)    సహాయక సంఘాల ఉద్యోగులు భారీ వసూళ్లు పాల్పడుతున్నారు. లోన్స్ పేరుతో మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.  దీనిపై క్షేత్రస్థాయి నుండి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రాజానగరం మండలంలో 73 మంది  విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ (విఒఎ) ఉన్నారు. వీరు బ్యాంకులకు మహిళా సహాయక సంఘాలకు మధ్యవర్తులు ఉంటూ లోన్స్ ఇప్పించడం, కొత్త గ్రామ సంఘాలు ఏర్పాటు, సమావేశాలు, రికార్డులు నమోదు  ముఖ్యమైన విధులు. వీరి పైన అధికారులుగా మండలంలో ఐదుగురు కమ్యూనిటీ కోఆర్డినేటర్లు (సి.సి) ఉన్నారు. గ్రామ స్థాయి లో విధులు నిర్వహిస్తున్న విఒఎలను సమన్వయం చేసుకుంటూ ప్రాజక్టు అధికారులకు నివేదికలు సిసిలు ఇస్తుండాలి. మండలంలో ఒకొక్క సిసి దగ్గర సుమారు 10 నుండి 15 మంది పైగా గ్రామాల్లో ఉన్న విఎఒలు ఉంటారు. బ్యాంకు నుండి తీసుకుంటున్న ప్రతి లోన్ కు రెండు శాతం అనాధికారికంగా విఒఎ, సిసిలు తీసుకుంటున్నారని ఆరోపించారు వస్తున్నాయి. ఉదాహరణకు ఒక సభ్యురాలకు ఒక లక్ష రూపాయలు బ్యాంకు లోన్  తీసుకుంటే దానిలో రెండు వేల రూపాయలు మామెళ్లగా వసూళ్ళు చేస్తున్నారు.  మండలంలో పని చేస్తున్న ఒకొక్క సిసి ప్రతీ ఏడాది సుమారు రూ.20 లక్షలు, విఒఎలు రూ. 10 లక్షలు వరకు అక్రమ వసూళ్ళు సంపాదన ఉంటుంది. ఇవి కాకుండా విఎఒలను, మహిళా సంఘాల సభ్యులను బ్యాంకు లోన్ పేరుతో లైంగిక వేధింపులకు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గ్రామాల్లో మహిళలు పరువు పోతుంది అని నోరు మెదపడం లేదు. వీటిపై ఫిర్యాదు చేసినప్పడు మాత్రమే జిల్లా అధికారులు హడావిడి చేసి మామోళ్ళు తీసుకుని మెక్కబడి విచారణ చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు. ­ క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేపట్టి విఒఎ, సిసిలపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు కోరుకుంటున్నారు.