User Avatar Crime

రాజానగరం జాతీయ రహదారి కలవచర్ల సెంటర్లో వ్యాన్ ఢీ కొని భర్త మృతి భార్యకు గాయాలు

రాజానగరం జాతీయ రహదారి కలవచర్ల సెంటర్లో వ్యాన్ ఢీ కొని భర్త మృతి చెందగా భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు నివాసం ఉంటున్న బిక్కిన సత్య భాస్కరరావు (70) భార్య పాపాయమ్మతో పెద్దాపురం మండలం కట్టమూరు శుభకార్యానికి శనివారం మోటారు సైకిల్ పై వెలుతున్నరు. మార్గమధ్యంలో జాతీయ రహదారి కలవచర్ల సెంటర్లో విశాఖపట్నం వైపుకు వెలుతున్న వ్యాన్ ఢీ కొంది. ఈ ప్రమాదంలో సత్య భాస్కరరావు తలకు గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన పాపాయమ్మను చికిత్స కోసం 108లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.