User Avatar others

రేపు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పవర్ కట్

రాజానగరం మండలం పల్లకడియం విద్యుత్ సబ్ స్టేషన్ మరమత్తులుకు శుక్రవారం 8 గంటల నుండి  మధ్యాహ్నం 3 గంటల వరకు రాజానగరం, కానవరం, నందరాడ, మల్లంపూడి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలుపుదల చేయడం జరుగుతుందని ఆపరేషన్స్ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్  జెపిబి నటరాజ్ తెలిపారు. దీని వలన ఈ సబ్ స్టేషన్ పరిధితోపాటు బ్రిడ్జి్కౌంటీ, గైట్ ఇంజనీరింగ్ కళాశాల, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం విద్యుత్ ఉండదన్నారు‌. వ్యవసాయానికి ఉదయం 3 గంటలకు విద్యుత్ సరఫరా జరుగుతుందని చెప్పారు. వినియోగదారులు, సిబ్బంది సహకరించాలని కోరారు.