User Avatar others

50వ వార్డులో పెన్షన్లు పంపిణీ …

రాజమహేంద్రవరం, ఆగస్టు 01 : ఎన్నికల సమయంలో ప్రజలకు టీడీపీ కూటమి ఇచ్చిన హామీ మేరకు పింఛన్‌ను రూ.4,000కి పెంచి ఇంటి వద్దకే పంపిణీ చేశామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తెలిపారు. ఈ రోజు తెల్లవారు జామున స్థానిక 50వ వార్డులోని వృద్ధులు, వికలాంగులకు, వితంతువులకు స్వయంగా ఇంటింటికీ వెళ్లి పెరిగిన పింఛన్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపట్టిన జనహిత కార్యక్రమాలు, ప్రజలలో విశ్వాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జీ రవి యాదవ్, మదీనా భాషా మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు