User Avatar Education

ప్రైవేట్ ఇంజనీరింగ్ వర్సిటీలు ఫీజుల వాత.. తల్లితండ్రులపై అదనపు భారం….

పిల్లలకు మంచి భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఇంజనీరింగ్ విద్య పైన ఎక్కువ ఆశక్తి చూపుతున్నారు. దీనిని అదునుగా చేసుకుని ఇంజనీరింగ్ విద్య సంస్థలు, ప్రైవేటు, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు విద్యార్థుల ముక్కు పిండి ఫీజులు వసూళ్లు చేస్తున్నాయి. జేఈఈ, ఈఏపి‌సెట్  కౌన్సెలింగ్ లో సీట్లు కేటాయింపు జరిగినా డబ్బులు కడితేనే సీటు కేటాయింపు జరుగుతుంది. దీని వలన ఇది పేద, మధ్యతరగతి విద్యార్ధుల తల్లితండ్రులపై అదనపు భారంగా ఉంది. డీమ్డ్, ప్రైవేటు విద్యాలయాల్లో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం ప్రత్యేకంగా పోటీ పరీక్షలు నిర్వహిస్తాయి. దీనిలో వచ్చిన మార్కులు ఆధారంగా ఫీజులు ఉంటాయి.  ప్రవేశ పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినా లేదా ఇంటర్మీడియట్ లో మార్కుల శాతం తక్కువగా ఉన్నా డీమ్డ్, ప్రైవేటు విద్యాలయాల్లో ఇంజనీరింగ్ సీట్లు ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ సీట్లుపై మక్కువ లేని బ్రాంచ్ లు ఫీజీలు తగ్గించినా సీఎస్ఈ ఇంజనీరింగ్ సీటు అధిక మెత్తంలో ఫీజులు వసూళ్లు జరుగుతున్నాయి.  ఎక్కువ మార్కులు సాధించిన వారికి రాయితీలు ఉన్న ఏమీ వర్తించడం లేదు. డీమ్డ్, ప్రైవేటు విద్యాలయాల్లో ప్రభుత్వానికి ఫీజుల నియంత్రణపై లేకపోవడంతో ఇష్టానుసారం వసూళ్ళు చేయడం దీనికి కారణం. ఈ ఉద్దేశంతో ఇంజనీరింగ్ కళాశాలు, డీమ్డ్, ప్రైవేటు విద్యాలయాలుగా మారిపోతున్నాయి. సీఎస్ఈ ఇంజనీరింగ్ బ్రాంచ్ కు డిమాండ్  ఉండడంతో ఎక్కువగా సెక్షన్లు ఏర్పాటు చేసి భారీ విద్యార్థులను చేర్చుకుని అధికంగా ఫీజులు వసూళ్లు చేస్తున్నారు. రాజానగరం సమీపంలో ఉన్న ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో ఒక్క సిఎస్ఈ ఇంజనీరింగ్ సీటు రూ. 10 లక్షలుపైగా తీసుకుంటున్నారు. వసతి, యూనిఫాం, లైబ్రరీ తదితర చార్జీలు అదనంగా చెల్లించాలి. ఈ ఇంజనీరింగ్ కళాశాలలో గాత రెండు రోజుల క్రితం ఈఏపీసెట్ కౌన్సిలింగ్ లో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు కన్న ఎక్కువ ఫీజులు వసూళ్లు చేస్తున్నారని విద్యార్ధులు తల్లిదండ్రులు విద్యార్ధి సంఘాలు ఆందోళన చేశారు. దీనిపై యాజమాన్యం దిగివచ్చి వి్యార్థి సంఘాలతో చర్చలు జరిపడంతో వివాదం సర్దిమనిగింది. మంచి ర్యాంకులు సాధించినా నాణ్యమైన విద్య అందిస్తున్న కళాశాలలో సీటు రావడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి…