User Avatar News

ఈజ్‌మెంట్ హక్కు ప్రకారం యడ్ల ఏసయ్యకు మూడు అడుగులు దారి.

రాజానగరం మండలం పాతతుంగపాడు  చెందిన యడ్ల ఏసయ్యకు ప్రభుత్వం సర్వే నెంబరు 286/1లో  2 ఎకరాలు 44 సెంట్లు ప్రభుత్వ భూమి డి-ఫారం ప‌ట్టా మంజూరు చేశారు. ఈ భూమికి దారి మార్గంగా పక్కనే ఉన్న సర్వే నెంబరు 285/5లో గంగుమళ్ళ వీరబాబు, గంగుమళ్ళ వెంకన్నబాబు అనే జిరాయితీ భూమి ఉందని దీనిని వారు ఇనుప తీగ ఫెన్సింగ్ వేసి దారి మార్గాన్ని మూసివేసి, భూమికి వెళ్లకుండా అడ్డుకుని ఇబ్బందులు పెడుతున్నారని ఏసయ్య ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆర్డీఓ తహశీల్దార్ జిఎల్ఎస్ దేవి క్షేత్రస్థాయిలో మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ ఆర్ కృష్ణ నాయక్ మాట్లాడుతూ ఈజ్‌మెంట్ హక్కు ప్రకారం యడ్ల ఏసయ్యకు సర్వే నెంబరు 285/5లో మూడు అడుగుల వెడల్పుతో నడక దారిమార్గం ఏర్పాటు చేయాలని తహశీల్దార్ ను ఆదేశించారు. దీని వలన భూమి లబ్ధిదారుడికి శాశ్వత పరిష్కారం ఉంటుందన్నారు.                                        👉.   రాజానగరం తహసీల్దారు కార్యాలయంలో మండల రెవెన్యూ అధికారులతో ఆర్డీఓ ఆర్డీఓ ఆర్ కృష్ణ నాయక్ క్క్షేత్ర స్ధాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. దీనిలో ఆయన మాట్లాడుతూ సిసిఆర్ సి కార్డులు, రేషన్ కార్డుల పంపిణీ, వాటర్ ట్యాక్స్, జీవో 23 అమలు , అన్నదాత సుఖీభవ, ఆధార్ సీడింగ్ లో తదితర వాటిలో రెవెన్యూ అంశాలపై వస్తున్న లోపాలను గుర్తించి పరిష్కారం చేయాలన్నారు. భూమిలేని నిరుపేదలు నివాస స్థలాల కోసం వచ్చిన అర్జీలను పరిశీలించాలన్నారు. దీనికి అవసరమైన భూములను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. స్వామిత్వ పథకం, రీ-సర్వే ప్రక్రియలపై సమాంతరంగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. దీనిలో  మండల తహసీల్దారు జి ఎల్ ఎస్ దేవి, డిప్యూటీ తహసీల్దార్‌లు, విఆర్పాఓలు పాల్గొన్నారు.