User Avatar News

స్మార్ట్ విద్యుత్ మీటర్ల బద్దలు కొట్టండి.. కూటమి ప్రభుత్వం మోసం చేసింది.. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ

స్మార్ట్ మీటర్ల తొలగించి ట్రు ఆఫ్ చార్జీలు ఇంధనపు సర్దుబాటు తదితర చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాజానగరంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ర్యాలీ నిర్వహించి విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో మంగళవారం ధర్నా చేశారు. దీనిపై అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు జే సత్తిబాబు మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్ మీటర్ల ప్రజలపై ఆర్ధిక భారం పడుతుందన్నారు. ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లను బద్దలు కొట్టమని పిలుపునిచ్చిన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరిగి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు ప్రజలు మోసం చేయడం అన్నారు. దీనిలో మరుకుర్తి వీరలక్ష్మి తుమ్మల కళావతి బొలిశెట్టి సత్యవతి తామర్ల గౌరి నక్క లక్ష్మి దోమ సీత గోరచదుర్గ తదితరులు పాల్గొన్నారు.