User Avatar News

లారీ లో అక్రమంగా తరలిస్తున్న 15 టన్నుల రేషన్ బియ్యం …

జాతీయ రహదారి ఆటోనగర్ సమీపంలో లారీలో అక్రమ తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. విజయవాడ నుండి రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారని సమాచారం రావడంతో జాతీయ రహదారి దివాన్ చెరువు ‌సమీపంలో పౌర సరఫరాల అధికారులు లారీ ఆపి తనిఖీలు చేపట్టారు. దీనిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం 324 సంచులలో 15,190 కేజీలు ఉన్నాయి. వీటి విలువ రూ.6,98,740. లారీ రూ.12 లక్షలు. అయితే లారీ డ్రైవర్ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు. ఒక తెల్లటి కారులో ఇద్దరు వ్యక్తులు ఎస్కార్ట్ గా వెలుతూ దీవాన్ చెరువు సెంటర్ లో ఆగి ఉంటామని బియ్యం లోడు ఎక్కడకు అనేది అక్కడ చెబుతామని వారు చెప్పినట్లు డ్రైవర్ అన్నాడని మండలం పౌర సరఫరాల అధికారి గులుగూరి బాపిరాజు తెలిపారు. విజయవాడ బెంజ్ సర్కిల్ లో కార్ ఎక్కించుకుని, దేవరపల్లి తీసుకువచ్చి లారీ అప్పగించినారని లారీ లోడు రికార్డు అడిగితే మొక్కజొన్న అని తనకు చెప్పినట్లు డ్రైవర్ చెప్పాడన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పౌర సరఫరాల అధికారి బాపిరాజు చెప్పారు.