User Avatar News

కలవచర్ల లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు కోసం రైతులు సీతారాంపురం రైతులు నిరాహారదీక్షలు…

కలవచర్ల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైతులకు పూర్తి ఆయకట్ట వరకు సాగు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ మండలంలో సీతారాంపురం సెంటర్లో రైతులు గురువారం నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రభుత్వానికి స్ధానిక శాసనసభ్యుడు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీక్షలో పాల్గొని గ్రామ సర్పంచ్ బొబ్బర వరహాలు ఉప సర్పంచ్ సురపురెడ్డి గోళ్లబ్బాయి ఎంపీటీసీ నాగమళ్ళ పండు వైకాపా నాయకులు అడబాల చినబాబు  అడబాల సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ కలవచర్ల లిఫ్ట్ ఇరిగేషన్ లో మూడు మోటార్లుకు ఒకటి మాత్రమే పని చేస్తుందని దీని వలన చివరి ఆయకట్టు వరకు పొలాలకు సాగునీరు రావడం లేదన్నారు. రైతుల కష్టాలను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.  ఫలితంగా సాగు భూములు బీటలు పడుతున్నాయని వెంటనే మూడు మోటార్లు తో రైతుల పోలాలకు నీరు అందించాలని డిమాండ్ చేశారు.  వైకాపా కేంద్ర కమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మేడా గురుదత్ దీక్ష శిబిరానికి వచ్చి సంగీభావం ప్రకటించారు. దీనిలో తోరాటి శ్రీను  తుమ్మల గంగరాజు  కోలా అబ్బులు మందాల దత్తుడు  తదితరులు పాల్గొన్నారు.