User Avatar News

ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం సమీపంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి పరిశీలించిన అధికారులు..

జాతీయ రహదారి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం సమీపంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అధికారులు శుక్రవారం పరిశీలించారు. దీనిపై గత నాలుగుల క్రితం ఎమ్మెల్సీ సోము వీర్రాజు విజయావాడలో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థ అధికారులతో చర్చలు జరిపారు. దీనిని వారు ఎమ్మెల్సీ వీర్రాజుతో కలిసి పరిశీలించారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి అవసరాన్ని అధికారులకు ఎమ్మెల్సీ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  చక్రద్వారాబంధం, వెలుగుబంద ప్రజలతోపాటు 15 గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.  జాతీయ రహదారిపై రాంగ్ రూట్ లో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అధికారులు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సానుకూలముగా స్పందించారని ఎమ్మెల్సీ తెలిపారు. వీరి వెంట మండల బిజెపి అధ్యక్షుడు ఆళ్ళ శివ నాగరాజు ఉన్నారు.