User Avatar others

రైతు సేవా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. ఇద్దరు విఆర్ఓలను కలెక్టరేట్ కు అటాచ్మెంట్ చేయాలని తహశీల్దార్ కు ఆదేశాలు..

రాజానగరం రెవెన్యూ సిబ్బంది పీఎం కిసాన్ యోజన పధకంపై నిర్లక్ష్యంగా ఉండటంపై జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నందరాడ, నరేంద్రపురం విఆర్ఓ లను కలెక్టరేట్ కు అటాచ్మెంట్ చేయాలని తహశీల్దార్ ను ఆదేశాలు జారీ చేశారు.  మండలంలో నందరాడ, నరేంద్రపురం రైతు సేవా కేంద్రాలను జిల్లా కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు.  రికార్డులు, డేటా ఎంట్రీ తదితర వాటిని పరిశీలించారు. దీనిలో విఆర్ఓలు సిహెచ్. ముని తిరుపతి,  ఎం. సత్యనారాయణ నిర్లక్ష్యంగా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వీరిని జిల్లా కలెక్టరేట్ కు అటాచ్మెంట్ చేయాలని తహశీల్దార్ జి.ఎల్.ఎస్. దేవి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఆగస్టు రెండో తేదీన పీఎం కిసాన్ యోజన పధకం రూ.2,000, అన్నదాత సుఖీభవ పథకం రూ.5,000 మెత్తం రూ. 7, 000 నేరుగా అర్హులైన రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి రైతు ఈ-క్రాప్ బుకింగ్ తప్పకుండా చేయించుకోవాలన్నారు‌. నగదు జమ కావడానికి ఎన్ పిసిఐ పోర్టల్‌ ద్వారా ఖాతా లింకింగ్ (ఈ-కేవైసీ సహా) ఉండాలని తెలిపారు. కలెక్టర్ తో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు తదితరులు ఉన్నారు.