User Avatar others

రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు

రాజానగరం మాధవి ఫంక్షన్ లో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్  ఆధ్వర్యంలో సామూహిక సీమంతాల కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. దీనిలో 216 మంది గర్భిణీలకు సీమంతాలు చేసి పసుపు కుంకుమ పువ్వులు గాజులు చీర రవిక పౌష్ఠికాహార పదార్ధాలు అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రెసిడెంట్ ఎమ్. వెంకటేశ్వరరావు (వెంకన్నబాబు) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు క్లబ్ జిల్లా గవర్నర్ డాక్టర్ వై. కళ్యాణ్ చక్రవర్తి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథిలుగా పాల్గొన్న రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ రెడ్డి ఇంద్రజ, డాక్టర్ జి.రామ్ భాస్కర్ గర్భిణీలు తీసుకోవలసిన ఆహారం జాగ్రత్తలు సూచనలు చేశారు. వ్యక్తిత్వ వికాస నిపుణురాలు వేణు శ్యామ శిశువుల సంరక్షణ వ్యక్తిత్వం గురించి వివరించారు. దీనిలో చార్టర్ ప్రెసిడెంట్ తీగల రాజా, ఇమ్మన్ని వెంకట్, కార్యదర్శి నింపి రఘనాధరాజు, సహాయ కార్యదర్శి డి.నవీన్ ప్రసాద్, ప్రోగ్రాం డైరెక్టర్ ఎస్.ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.