User Avatar others

3,801 మందికి కొత్తగా స్పౌస్ పెన్షన్లు మంజూరు… జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి

తూర్పు గోదావరి జిల్లాలో 3,801 మందికి కొత్తగా జీవిత భాగస్వామి (స్పౌస్) పెన్షన్లుకు  రూ.1.52 కోట్లు విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. ఇవి అత్యధికంగా రాజమహేంద్రవరం అర్బన్ 443 మందికి, రూ.17.72 లక్షలు స్పౌస్ పెన్షన్ల సంబంధించిన మంజూరి చేయగా  అనపర్తి 169, బిక్కవోలు 194, చాగల్లు 137,  దేవరపల్లి  194, గోకవరం 158, గోపాలపురం 163, కడియం 184 ,. కోరుకొండ 223, కొవ్వూరు 140 , కొవ్వూరు (అర్బన్) 57 , నల్లజర్ల 168 , నిడదవోలు 157 , నిడదవోలు (అర్బన్) 70, పెరవలి 165 , రాజమండ్రి (అర్బన్) 443 , రాజమండ్రి (రూరల్) 284 , రాజానగరం 256, రంగంపేట 174 , సీతానగరం 187 , తాళ్లపూడి 109, ఉండ్రాజవరం 169 మంది అన్నారు. ఇవి ఆగస్టు ఒకిటో తేదీ నుండి పంపిణీ చేయడం జరుగుతుందని ఈమేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.